![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -538 లో.. రామరాజు, తిరుపతి బయటకి వచ్చి డ్రింక్ చేస్తారు. ఆ భద్రవతి వాళ్ళు నన్ను అనాధ అంటుంటే నా బుజ్జమ్మ నాకు తోడుగా ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యానురా కానీ ఇప్పుడు నన్ను మోసం చేసి నన్ను చంపేసిందని రామరాజు ఎమోషనల్ అవుతాడు. తిరుపతి ఏదో చెప్పబోతుంటే ఏంట్రా నువ్వు కూడా అందులో ఉన్నావా అని రామరాజు అడుగుతాడు. లేదు బావ నన్ను నమ్ము అని తిరుపతి అంటాడు.
నిన్ను నమ్ముతున్నారా ఎందుకంటే అందరు మోసం చేస్తే నేను అసలు తట్టుకోలేనని రామారాజు అంటాడు. అప్పుడే ధీరజ్ వచ్చి మిమ్మల్ని అమ్మ ఎప్పుడు మోసం చెయ్యదు నాన్న అని చెప్తాడు.. ఇంటికి వెళదాం పదండి.. చందు అన్నయ్య, అమూల్య బాధపడుతున్నారని ధీరజ్ అనగానే నేను ఉన్నదే మీ కోసంరా అని రామరాజు అంటాడు. రామరాజుని తీసుకొని ధీరజ్ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు నిన్ను ఆ కళ్యాణ్ గాడు మోసం చేసినప్పుడు నేను గుర్తురాలేదా ఇప్పుడు వాడు నీ జీవితాన్ని ఉద్దరించినట్లు మాట్లాడుతున్నాడని భద్రవతి ఎమోషనల్ అవుతుంది. దాంతో ప్రేమ తనని పట్టుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత ఇంకా మీ నాన్న రావడం లేదని వేదవతి ఏడుస్తుంటే ధీరజ్ వెళ్ళాడు కదా అమ్మ నువ్వు ఏం టెన్షన్ పడకు అని చందు అంటాడు. అంతలోనే రామరాజుని తీసుకొని ధీరజ్ వస్తాడు. ఏవండీ అని రామరాజుని హగ్ చేసుకొని వేదవతి ఏడుస్తుంది. ఒరేయ్ పెద్దోడా నేను ఎవరితో మాట్లాడడం లేదు.. నాతో మాట్లాడాలని కానీ ఎలాంటి ప్రయత్నం చెయ్యొద్దని చెప్పు అని రామరాజు అంటాడు.
ఏవండీ మీరు మాట్లాడకపోతే నేను ఉండలేనని వేదవతి ఎమోషనల్ అవుతుంది. ఒరేయ్ చిన్నోడా నీ భార్యని ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నీదే అని రామారాజు అంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్లి నన్ను క్షమించు కోపంలో నేను ఏం ఆలోచించలేదని అంటాడు. ప్రేమ కూడా ఒప్పుకొని ధీరజ్ తో వస్తుంటే భద్రవతి అడ్డుపడి వాడి మాయలో మళ్ళీ పడకని ప్రేమని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |